రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.
ఈ జన్మదిన వేడుకల్లో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల నర్సింగం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చుక్క శేఖర్, మహిళ అధ్యక్షురాలు ధర్మారెడ్డి హారిక రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరు తిరుపతి, మైనార్టీ నాయకులు మహమ్మద్ హమీద్ సలీం సర్దార్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.