ఉద్యమ నినాదాలను... కేసిఆర్ సర్కారు నిజం చేస్తుంది

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను… స్వరాష్ట్రంలో సిఎం కేసిఆర్ నాయకత్వంలో నిజం అవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రకృతి వనం, హెల్త్ సెంటర్, అంగన్ వాడి భవనం, మహిళా సంఘం భవనం, వైకుంఠ ధామంను ప్రారంభించారు.

 Kcr Government Will Make The Slogans Of The Movement Come True Boinapalli Vinod-TeluguStop.com

అనంతరం బదనకల్ గ్రామంలో 132/11 సబ్ స్టేషన్ , నూతన గ్రామపంచాయతీ భవనం ను ప్రారంభించారు.

ఆ వెంటనే ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి చేశారు.

ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు.పోత్గల్ సింగిల్ విండో కార్యాలయం సందర్శించారు.

పోత్గల్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతు వేదిక, ప్రగతి భవనం కు ప్రారంభోత్సవాలు చేశారు.నూతన గ్రామ పంచాయతీ భవనానికి , పోచమ్మ గుడి రోడ్డు భూమి , గంగమ్మ గుడి రోడ్డు కు భూమి పూజ చేసారు.

అదే గ్రామంలో అంగన్ వాడి, హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాళేశ్వరం , ఇతర సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం పూర్తిచేసి కోటి ఎకరాల కు సాగునీరు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనీ చెప్పారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సిఎం కేసిఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు.దేశానికే ఆదర్శవంతమైన అనేక సంకెమ పథకాలు తెలంగాణాలో ప్రవేశ పెడితే ఈ రోజు దేశం మొత్తం తెలంగాణ పథకాలు అనుసరిస్తుందన్నారు.

నీళ్ళు,నిధులు నినాదాలు ఇప్పటికే నిజమయ్యాయనీ… ఇప్పటికే వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా, మరిన్ని నియామకాల కోసం నోటిఫికేషన్ లు జారీ చేసిందన్నారు.

ఇటీవలే విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో వేలాది మంది అభ్యర్థులు ఎంపికయ్యారనీ తెలిపారు.

ముస్తాబాద్ మండలం నుండి కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రణాళిక సంఘం ‌ఉపాద్యకులు బోయినిపల్లి వినోద్ కుమార్ సన్మానించారు.కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం సులభమేనని అందుకు ఈ అభ్యర్థులు నిదర్శనమని చెప్పారు .మహిళా లోకానికి అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.తెలంగాణ రాక ముందు ఎట్ల ఉండే… తెలంగాణ వచ్చినాక ముస్తాబాద్ ఏట్ల అభివృద్ధి చెందిందో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, టేస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు,రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ , సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య , ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ నర్సయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గోపాల్ రావు,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube