రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) బోయినిపల్లి మండలం లోని కొదురుపాక గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలను( Bonalu ) నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఇంటికో బోనం చొప్పున నెత్తిన పెట్టుకొని దప్పు చప్పుల మధ్య బైండ్ల పూజారుల విన్యాసాల తో, శివసత్తుల పూనకాలతో ర్యాలీగా పోచమ్మ( Pochamma Temple ) ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య మాట్లాడుతూ ఆషాడ మాసం లో పోచమ్మ లకు బోనాలు చేయడం ఆనవాయితీ అని అన్నారు.వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవతను కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య ,వైస్ ఎంపిపి కోనుకటి నాగయ్య,తదితరులు ఉన్నారు