బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( AP CM YS Jagan ) ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.” దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.ఈ పండుగ జరుపుకుంటారు.త్యాగనికి ప్రతీక బక్రీద్ పండుగ నిదర్శనం” అని అన్నారు.“ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా ముస్లింలు( Muslims ) అందరు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు.అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా” అనే సీఎం జగన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

 Ap Cm Ys Jagan Bakrid Wishes To Muslims, Ap Cm Jagan, Bakrid,muslims,ap People,r-TeluguStop.com

ఈనెల 29 అనగా రేపు గురువారం బక్రీద్( Bakrid ) సందర్భంగా దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ ముస్లిం ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు.ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో రంజాన్ తర్వాత జరుపుకునే పండుగ బక్రీద్.

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను… అత్యంత భక్తి భావంతో ప్రత్యేక ప్రార్థనలతో కుటుంబ సమేతంగా జరుపుకుంటారు.రేపు బక్రీద్ పండుగ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సెలవు.దీంతో చాలామంది రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా బక్రీదు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube