28 పోలీస్‌ శిక్షణా కేంద్రాల్లో 14,881 మందికి శిక్షణ: డీజీపీ

పోలీస్‌ శాఖ( Police Department )లో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయిలో ఆయా విభాగాల్లో కొత్తగా నియామకం కానున్న 14,881 మందికి రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణాకేంద్రాల్లో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు.శిక్షణాకేంద్రాల్లో ఏర్పాట్లపై శిక్షణావిభాగం ఐజీ తరుణ్‌ జోషి( IG Tarun Joshi )తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ శిక్షణాకళాశాలల ప్రిన్సిపాళ్లతో డీజీపీ తన కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 14,881 People Trained In 28 Police Training Centers: Dgp-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు, అక్టోబరు నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.శిక్షణా తరగతులు ప్రారంభం కావడానికి ముందుగానే పీటీసీల్లో మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణకు కావాల్సిన పరికరాలు, వసతి సౌకర్యం ఇతర అన్నింటిని ఏర్పాటు చేసుకోవాలని, మహిళా పోలీస్‌ కానిస్టేబుళ్ల శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube