ఫెన్నెల్ సీడ్స్‌తో ఇలా చేస్తే ప‌ల్చ‌టి జుట్టు ఒత్తుగా మారుతుంది..తెలుసా?

ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది ప‌ల్చ‌టి జుట్టుతో తెగ బాధ ప‌డిపోతుంటారు.ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, జీవ‌న శైలిలో వ‌చ్చే మార్పులు, హార్మోన్ ఛేంజ‌స్‌, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, కాలుష్యం.

 Fennel Seeds Help To Get Thick Hair! Fennel Seeds, Thick Hair, Latest News, Hair-TeluguStop.com

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు ఊడి ఊడి ప‌ల్చ‌గా మారిపోతోంది.దాంతో జుట్టు మ‌ళ్లీ ఒత్తుగా మార్చుకోవ‌డం ఎలానో తెలియ‌క‌.

షాంపూలు, నూనెలు మారుస్తుంటారు.అయితే ప‌ల్చ‌టి జుట్టును ఒత్తుగా మార్చ‌డంలో ఫెన్నెల్ సీడ్స్‌(సోంపు) అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఫెన్నెల్ సీడ్స్‌లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు జుట్టు రాల‌డానికి అడ్డు క‌ట్ట వేసి.మళ్లీ ఒత్తుగా, పొడ‌వుగా పెరిగేలా చేస్తాయి.

మ‌రి ఇంత‌కీ ఫెన్నెల్ సీడ్స్ ను హెయిర్‌కి ఎలా యూజ్ చేయాలో చూసేయండి.ముందు నాలుగు స్పూన్ల ఫెన్నెల్ సీడ్స్‌ను తీసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఫెన్నెల్ సీడ్స్ పౌడ‌ర్‌, మూడు స్పూన్ల పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు కుదుళ్ల‌కు మాత్రం బాగా ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట అనంత‌రం కెమిక‌ల్స్ లేని షాంపూతో త‌ల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక‌.

జుట్టుకు మంచి పోష‌ణ అందుతుంది.ఊడ‌టం త‌గ్గి ఒత్తుగా పెర‌గ‌డం స్టార్ట్ అవుతుంది.

అలాగే మ‌రో విధంగా కూడా ఫెన్నెల్ సీడ్స్‌ను వాడొచ్చు.ఒక బౌల్‌లో రెండున్న‌ర గ్లాసుల వాట‌ర్‌, మూడు స్పూన్ల ఫెన్నెల్ సీడ్స్ పౌడ‌ర్ వేసి బాగా మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత నీటిని ఫిల్ట‌ర్ చేసి చ‌ల్లారిన త‌ర్వాత స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.ఇప్పుడు జుట్టుకు రెగ్యులర్​ ఆయిల్ అప్లై చేసి.

ఆపై ఫెన్నెల్ సీడ్స్ వాట‌ర్‌ను జుట్టుకు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు స్ప్రే చేసుకోవాలి.న‌ల‌భై నిమిషాల అనంత‌రం త‌ల స్నానం చేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెర‌గ‌డంతో పాటు తెల్ల‌గా మార‌కుండా కూడా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube