సాధారణంగా చాలా మంది అండర్ ఆర్మ్స్ డార్క్ గా ఉంటాయి.మగవాళ్లు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు.
కానీ మహిళలు మాత్రం ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.అండర్ ఆర్మ్స్ డార్క్ గా ఉండటం వల్ల స్లీవ్ లెస్ దుస్తులు వేసుకునేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ నలుపును వదిలించుకోనేందుకు నానా తిప్పలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే డార్క్ అండర్ ఆర్మ్స్ ను వైట్ గా మార్చుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వైట్ రైస్, రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు, రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.

చివరిగా సరిపడా రైస్ వాటర్ ను వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని స్మూత్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా అండర్ ఆర్మ్స్ ను క్లీన్ చేసుకోవాలి.ఈ హోమ్ మేడ్ మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే అండర్ ఆర్మ్స్ లో పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.
అక్కడి చర్మం తెల్లగా మరియు మృదువుగా మారుతుంది.డార్క్ అండర్ ఆర్మ్స్ తో సతమతం అవుతున్నవారికి ఈ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.కాబట్టి తప్పకుండా పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
