కీలక మలుపు తో డింపుల్ కేసు...

హీరోయిన్ డింపుల్ హయతి( Dimple Hayati ) నేడు హైకోర్టు మెట్లెక్కారు .ఐపీఎస్ రాహుల్ హెగ్డే( IPS Rahul Hegde ) కేసులో ఆమె కోర్టు ని ఆశ్రయించింది.

 Dimple Case With A Turning Point, Dimple Hayathi, Ips Rahul Hegde, Jubilee Hills-TeluguStop.com

ట్రాఫిక్ డీసీపీ అధికారిక వాహనాన్ని తన బీఎండబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందంటూ ఈ మధ్యే డింపుల్ హయతి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కాలితో తన్ని, తన బెంజికారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టి, పైగా దుర్భాషలాడిందంటూ డింపుల్ హయాతిపై జూబ్లీ హిల్స్ పోలీసులు ( Jubilee Hills Police )కేసు నమోదు చేశారు.

పబ్లిక్ సర్వెంట్‌ను అతని విధులను చేసుకొనివ్వకుండా అడ్డుకోవడం , అలాగే అక్రమ నిర్బంధంలో ఉంచడం, బహిరంగ ప్రాంతంలో ర్యాష్ డ్రైవింగ్ చేయడం పై ఇలా దాడి, క్రిమినల్ ఫోర్స్ కేసులు పెట్టారు.అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులు నమోదు చేశారని డింపుల్ హయాతి నేడు హైకోర్టును ఆశ్రయించారు.

 Dimple Case With A Turning Point, Dimple Hayathi, IPS Rahul Hegde, Jubilee Hills-TeluguStop.com

Telugu Dimple Point, Dimple Hayathi, Chetan Kumar, Ips Rahul Hegde, Jubilee Hill

పోలీసులు తన వాదనని వినకపోవడంతో.తన లాయర్ ద్వారా డింపుల్ హైకోర్టును ఆశ్రయించింది.ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితోనే తనపై ఈ తప్పుడు కేసు నమోదు చేశారనేలా ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.అయితే ఆమె వేసిన పిటిషన్‌లో ఈ కేసులో కొందరు కొంతమంది ప్రభావాలకు లోనయ్యారని, ఈ పరంగానే డ్రైవర్‌ ఎం.చేతన్‌ కుమార్‌ ( Driver M.Chetan Kumar )ఫిర్యాదుతో డీసీపీ (ట్రాఫిక్‌ పోలీస్‌) పేరును.గుర్తు తెలియని పేరుగా పేర్కొంటూ ఫిర్యాదు చేయడంతో తనపై జుబ్లి హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారని , అలాగే డిఫాక్టో ఫిర్యాదు దారు పోలీసు అధికారిగా తన అధికారిక సామర్థ్యాన్ని దుర్వినియోగం చేశారని ఆమె పేర్కొన్నారు.అలాగే ఫార్చ్యూనర్‌తో చూసుకుంటే సైజులో చాలా చిన్నది.

ఇక ఎంతో సున్నితంగా ఉండే బీఎండబ్ల్యూ కారు డాష్ ఇస్తే అంతకంటే బలమైన, బరువైన పోలీసు వ్యాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదని హయతి పిటిషన్ లో పేర్కొన్నారు.

Telugu Dimple Point, Dimple Hayathi, Chetan Kumar, Ips Rahul Hegde, Jubilee Hill

అయితే డింపుల్ పిటిషన్‌లో విక్టర్ డేవిడ్( Victor David ) కో-పిటిషనర్ గా ఉన్నారు.ఇక పోలీసులు తమను తమ ముందు హాజరుకావాలని పిలుస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.మొత్తనాగా తనపై తప్పుడు కేసు పెట్టారని తెలుపుతూ.

తనని అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది.డింపుల్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.

కోర్టులో ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.ఇదే కేసులో నిందితుడుగా ఉన్న విక్టర్ డేవిడ్ అనే అతనికి ఎందుకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

ఇక పిటిషనర్లను విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు పిలిపించడంలో విధి విధానాలను అనుసరించాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.అలాగే డింపుల్‌ని కూడా పోలీసుల విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినట్లుగా సమాచారం.

ఇక హయాతీ తరపు న్యాయవాది పాల్ సత్యనాధన్ డేవిడ్( Paul Satyanadhan David ) మాటలాడుతూ కేసుపై న్యాయపరంగా పోరాడతామని చెప్పారు.పార్కింగ్ సమస్యపై ఆమె ప్రతిష్టను దెబ్బతీయడమీ కాకుండా ఆమెను కటకటాల వెనక్కి నెట్టాలనే లక్ష్యంతో అధికారి నటిపై పగ పెంచుకున్నారని చెప్పారు.అంతే కాకుండా ఇది పోలీసుల అత్యుత్సాహం తప్ప ఇంకేమి లేదని .ఇక వారి దౌర్జన్యాలను ఎవరూ ప్రశ్నించకపోతే, అంతం ఉండదని చెప్పుకొచ్చారు.నా క్లయింట్ అయిన హయతి ప్రశ్నించిన కారణంగానే ఆమె ఈ విధమైన సమస్యలన్నింటినీ ఎదుర్కొంటోంది అని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube