ప‌రీక్ష‌ల టైమ్‌లో ఖ‌చ్చితంగా తీనాల్సిన ఐదు ఆహారాలు ఏంటో తెలుసా?

ఇది ప‌రీక్ష‌ల స‌మ‌యం.ఈ టైమ్‌లో విద్యార్థాలు పుస్త‌కాల పురుగులుగా మారిపోతుంటారు.ప‌రీక్ష‌ల‌ను బాగా రాసి మంచి మార్కుల‌ను సంపాదించ‌డం కోసం.ఏడాదంతా చదివిన పాఠాల‌ను మ‌ళ్లీ తిర‌గేస్తూ ఉంటారు.ఈ క్ర‌మంలోనే ప‌రీక్ష‌ల ఒత్తిడితో తిండిని, నిద్ర‌ను ప‌ట్టించుకోవ‌డం మానేస్తారు.కానీ, ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు.

 These Are The Five Foods That Should Definitely Eat During Exam Time? Exam Time,-TeluguStop.com

కంటి నిండా నిద్ర‌, డైట్‌లో పోష‌కాహారం ఉంటేనే చ‌దివిన‌వ‌న్నీ గుర్తు ఉంటాయి.లేదంటే ప‌రీక్ష‌లు రాసే స‌మ‌యానికి మైండ్‌లో స్టోర్ చేసుకున్న పాఠాల‌న్నీ ఎగిరిపోతాయి.

కాబ‌ట్టి, ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా కండి నిండా నిద్ర‌పోవాలి.అలాగే డైట్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే ఐదు ఆహారాల‌ను ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

మ‌రి లేటెందుకు ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.

చేప‌లు.

ప్ర‌స్తుత వేస‌వి కాలంలో ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.చేప‌ల్లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా నిండి ఉంటాయి.

అందువ‌ల్ల‌, ప‌రీక్ష‌ల స‌మ‌యంలో వీటిని తీసుకుంటే మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది.జ్ఞాపకశక్తి, ఏకాగ్ర‌త రెండూ రెట్టింపు అవుతాయి.

ప‌రీక్ష‌ల స‌మ‌యంలో తీసుకోవాల్సిన ఆహారాల్లో ట‌మాటో ఒక‌టి.ముఖ్యంగా ట‌మాటోను సూప్ రూపంలో తీసుకుంటే.

మెదడు సామర్థ్యం పెరుగుతుంది.ఒత్తిడి, త‌ల‌నొప్పి, మ‌తిమ‌ర‌పు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

అలాగే కొంద‌రు ప‌రీక్ష‌ల టైమ్‌లో నీర‌సంగా క‌నిపిస్తుంటారు.ఆ నీర‌సాన్ని వ‌దిలించి చదువుకునేటప్పుడు శరీరానికి కావల్సిన శక్తిని అందించ‌డంలో న‌ట్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, ప‌రీక్ష‌ల స‌మ‌యంలో బాదం ప‌ప్పు, వాల్‌న‌ట్స్‌, పిస్తా ప‌ప్పు, జీడిప‌ప్పు వంటి న‌ట్స్‌ను తీసుకోవాలి.

Telugu Foods, Exam Time, Exams, Tips, Latest-Telugu Health Tips

పాల‌కూర‌.ఇది ఓ అద్భుత‌మైన ఆకుకూర‌.ప‌రీక్ష‌ల స‌మ‌యంలో పాల‌కూర‌ను తీసుకుంటే శరీరానికి కావాల్సిన బోలెడ‌న్ని పోష‌కాలు ల‌భిస్తాయి.

ఇమ్యూనిటీ రెట్టింపు అవుతుంది.నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి చేర‌కుండా ఉంటాయి.

గుడ్డు.ఓ సంపూర్ణ పోష‌కాహారం.

ప‌రీక్ష‌ల స‌మ‌యంలో త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన ఆహారం కూడా.రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తింటే పరీక్షల సమయంలో ఆరోగ్యంగా, బలంగా, చురుగ్గా ఉంటారు.

ఇక ఈ ఐదు ఆహారాల‌తో పాటు వాట‌ర్ ను సైతం శ‌రీరానికి స‌రిప‌డా అందించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube