మ‌ళ్లీ మొద‌లైన పీసీసీ చీఫ్ వివాదం.. గ‌ళ‌మెత్తిన మ‌రో నేత‌

తెలంగాణ‌లో పీసీసీ చీఫ్ ప‌ద‌వి వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు.కాంగ్రెస్‌లో ఎవ‌రికి వారే త‌మ‌కంటే త‌మ‌కే ప‌ద‌వి ఇవ్వాలంటూ ఇప్ప‌టిఏ ప్ర‌జ‌ల్లో పేరు త‌గ్గించుకుంటున్నారు.

 Controversy Over Pcc Chief Resumes Controversy Over Pcc Chief Resumes, Pcc Chief-TeluguStop.com

రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, జీవ‌న్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, జ‌గ్గారెడ్డి లాంటి నేత‌లు ఈ ప‌ద‌వి కోసం తీవ్రంగా పోటీ ప‌డుతున్నారు.ఒకరిపై మ‌రొక‌రు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

Telugu Congress, Jeevan Reddy, Madhu Yashki, Madhu Yaskhi, Pcc, Renath Reddy, Ts

దీంతో గ‌తంలోనే జ‌ర‌గాల్సిన ఈ ప‌ద‌వి నియామ‌కాన్ని వీరి మ‌ధ్య పోటీని చూసి అధిష్టానం వాయిదా వేసింది.దీంతో ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ప్ర‌స్తుతానికి ఆ కుర్చీలో ఉన్నారు.అయితే ఈ నెల‌లోనే ఆ ప‌ద‌వి నియామ‌కం ఉంటుంద‌ని తెలియ‌డంతో మ‌ళ్లీ వివాదం రాజుకుంది.నేత‌లు మాట‌ల తూటాలు పేల్చుతున్నారు.త‌మ అనుచ‌రుల‌తో సోష‌ల్ మీడియాలో త‌మ‌కు ప‌ద‌వి వ‌చ్చేలా చూడాలంటూ డిమాండ్ చేయిస్తున్నారు.

అయితే ఇప్పుడు మ‌రో నేత త‌న‌కే ప‌ద‌వి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.

నిజ‌మాబాద్ మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ తెర‌మీద‌కు వ‌చ్చారు.తానూ పీసీసీ రేసులో ఉన్నానంటూ ఈ రోజు వెల్ల‌డించారు.

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కే ప‌ద‌వి ఇవ్వాలంటూ కోరారు.దీంతో మ‌రోసారి ఈ వివాదం ముదిరింది.

అయితే దీన్ని ఇప్ప‌ట్లో భ‌ర్తీ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలు మ‌రింత రాజుకుంటున్నాయి.

Telugu Congress, Jeevan Reddy, Madhu Yashki, Madhu Yaskhi, Pcc, Renath Reddy, Ts

అయితే ఈ రోజు గాంధీ భ‌వ‌న్‌లో కాంగ్రెస్ నేత‌లంద‌రూ క‌లిసి స‌త్యాగ్ర‌హ దీక్ష చేయ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.తామంతా ఒకే తాటిపై ఉన్నామంటూ వారు ఇండికేష‌న్ ఇచ్చారు.కానీ అంత‌లోపే మ‌ధుయాష్కీ ఈ విధ‌మైన డిమాండ్ చేయ‌డంతో వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.అయితే మ‌ధుయాష్కీ మాత్రం ఈనెల‌లోనే ప‌ద‌వి నియామ‌కం ఉంటుంద‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డంతో కాంగ్రెస్‌లో ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయ‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube