బీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా ధీమా...!

సూర్యాపేట జిల్లా:బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతె మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మంద ఉపేందర్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని పొంది,ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందిన రూ.2 లక్షల బీమా చెక్కును నామినీ భార్య ‌మంద ఉమారాణి మరియు కుటుంబ సభ్యులకు మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి రాజకీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలందరికీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

 Insurance For Brs Workers Slow , Maddi Madhusudan Reddy , Gundala Gangulu, Gandh-TeluguStop.com

కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్టం అభివృద్ధి పథంలో పయనించిందన్నారు.బీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్తలెవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందినట్టైతే నామినికీ రూ.2 లక్షల బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ అందజేస్తున్నదన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు,జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు,మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి,మండల నాయకులు మిక్కిలినేని సతీష్,నవిల రామ్ కోటీ, వెంకట్ రెడ్డి,కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్లు గుండాల గంగులు,గాంధీ,నాయకులు సత్యనారాయణ రెడ్డి, కోటిలింగం,బాబు,రామకృష్ణ, శ్రీను,గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube