మార్చి, ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు..: సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయని సీఎం జగన్ అన్నారు.విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

 Elections In Ap In March And April: Cm Jagan-TeluguStop.com

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో చెప్పాలన్నారు.

రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కార్యక్రమాలు చేపడుతున్నామన్న సీఎం జగన్ ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 15 వేల ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ క్రమంలోనే కోటీ 60 లక్షల ఇళ్లకు వెళ్లి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.అదేవిధంగా జనవరి నెల నుంచి పింఛన్ రూ.3 వేలు అందిస్తామని వెల్లడించారు.ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube