బిగ్ బాస్( Bigg Boss ) అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకున్న విషయం తెలిసిందే.
ఇక 7వ సీజన్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది.గత సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈసారి అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసి సీజన్ 7 ను సెప్టెంబర్ 3న గ్రాండ్ గా అట్టహాసంగా స్టార్ట్ చేసింది.
ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జుననే చేస్తుండగా హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకోగా ఐదు వారాల్లో ఐదు మంది ఎలిమినేషన్ అయ్యారు.తాజాగా ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి.బిగ్ బాస్ 2.0( Bigg Boss 2.0 ) గ్రాండ్ గా నిన్న అక్టోబర్ 8న లాంచింగ్ జరిగింది.ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో నయని పావని( Nayani Pavani ) ఒకరు.
ఈమె అందరి కంటే ఆకర్షణీయంగా కనిపించి ఆకట్టుకుంది.
మరి ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని అంత ఆరా తీస్తున్నారు.మరి నయని పావని టిక్ టాక్ తో కెరీర్ ను స్టార్ట్ చేసి సినిమాలపై ఉన్న మక్కువతో ఈ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈమె అసలు పేరు సాయి రాజు పావని( Sai Raju Pavani ).ఈమె బిగ్ బాస్ 2.0 ద్వారా ఎంట్రీ ఇచ్చింది.రావడమే అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఈమె తెలంగాణ వాసి.అనేక కవర్ సాంగ్స్ తో పాటు చాలా షార్ట్ ఫిలిమ్స్( Nayani Pavani Short Films ) లో కూడా నటించింది.ఇక ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ డాన్స్ షోలో కూడా తన టాలెంట్ ను నిరూపించుకుని ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి మరింత మందికి చేరువ అయ్యింది.సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్ ను కలిగి ఉండడంతో ఈమె హౌస్ లో కొన్ని వారాలు సేఫ్ గా ఉండడం ఖాయం.
చూడాలి తన ఆటతీరుతో ఎలా మెప్పిస్తుందో.