రాజన్న సిరిసిల్ల జిల్లా: రోడ్డు నిర్మాణానికి రెండు కోట్ల 70 లక్షల నిధులతో భూమి పూజ చేశారు.ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలంలో స్థానిక గిద్ద చెరువు కట్ట నుండి రాజన్నపేట గ్రామానికి అంతర్గత డాంబర్ రోడ్డు వేయడానికి సోమవారం ప్రజా ప్రతినిధులు ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య లు కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య( Thota Agaiah ) మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట నుండి రాజన్నపేట వెళ్ళుటకు సుమారు 4 కిలోమీటర్ల మేర దూర భారం తగ్గుతుందని అన్నారు.గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు.
మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో జిల్లా సష్యశ్యామలం అయిందని పేర్కొన్నారు.రానున్న శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి హైట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ),సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణహరి,ఎంపిటీసీ సభ్యులు పందిళ్ళ నాగరాణి పర్షరాములు గౌడ్, ఎలగందుల అనసూయ నర్సింలు సింగిల్ విండో డైరెక్టర్ నేవురి వెంకట నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంట బాలా గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గుల్లపల్లి నరసింహారెడ్డి, జగన్ రెడ్డి, దేవిరెడ్డి, గుండాడి వెంకట్ రెడ్డి,ప్రజాప్రతినిధులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.