పాల్గొన్న అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు అలరించిన అయ్యప్ప స్వాముల నృత్యాలు , రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా స్వామి వారి వేడుకలు అయ్యప్ప దీక్షా పరులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల నేతృత్వంలోప్రత్యేక పూజలు జరిపారు.
ఉదయం గణపతి హోమం అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి నీ పల్లకి సేవలో ఎల్లారెడ్డిపేట పట్టణంలోని పురవీధులలో డి జే భక్తీపాటల తో అయ్యప్ప స్వాముల ఆటపాటలతో ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు అయ్యారు.
అనంతరం ఆలయంలోని అయ్యప్ప స్వామికి చక్ర స్నానం నిర్వహించారు.ఈ సందర్భంగా అల్మాస్పూర్ శ్రీను గురుస్వామి, మధు గురుస్వామి, కందుకూరి రవి గురుస్వాముల చేపంచామృతాభీ షేకాలు అయ్యప్పకు అభిషేకాలు జరిపారు.
నూతన సంవత్సరం ను పురస్కరించు కొని స్వామి వారి వేడుకలలో వేలాదిమంది భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామిపూజా కార్యక్రమాలను తిలకించి మొక్కలు చెల్లించుకున్నారు.ఆలయ వేడుకలలో పాల్గొన్న భక్తులకు దేవి టిఫిన్స్ మెస్ యజమానీ కందుకూరి నవీన్, రాచర్ల గొల్లపల్లి కి చెందిన గోగురి వెంకటనారాయణ రెడ్డి లు శివ సాయి గార్డెన్ లో వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.
రాత్రి 9 గంటలకు ముస్తాబాద్ శ్రీశ్రీశ్రీ శాంతి స్వరూపులు రాజు గురుస్వామి కరకములచే పదినిమిట్టాంబడి పడిపూజను రాజు గురు స్వామి, సాయి రమ్య దంపతులు నిర్వహించారు.పడిపూజకు విచ్చేసిన భక్తులకు బొమ్మ కంటి భాస్కర్ జ్యోతి దంపతులు అల్పాహారాన్ని అందజేశారు.