మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని విద్యార్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆరా తీశారు.వేములవాడ పట్టణంలోని బీసీ సంక్షేమ హాస్టల్ ను శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Is The Meal Served According To The Menu Collector Sandeep Kumar Jha, Meal , Me-TeluguStop.com

ముందుగా హాస్టల్ లోని విద్యార్థుల వసతి గదులు, ఆవరణ, పరిసరాలు, స్టోర్ రూం, కిచెన్ గదిని పరిశీలించారు.డిప్లొమా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడారు.

రోజూ మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారా? అని ఆరా తీశారు.

రానున్న పరీక్షలకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.

ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని పేర్కొన్నారు.హాస్టల్ లో ఎందరు విద్యార్థులు ఉంటున్నారో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను అడగగా, 97 మంది విద్యార్థులు ఉంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.నిత్యం విద్యార్థులతో ఆయా పాఠ్యాంశాలు చదివించాలని, రాయించాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube