రాజన్న సిరిసిల్ల జిల్లా : ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతు తనదైన శైలిలో విద్యా బోధన చేసి ఎందరో విద్యార్థుల హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిన ప్రధానోపాధ్యాయులు మిట్టపల్లి పరశురామ్ , భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు రొండ్ల జగన్మోహన్ రెడ్డి సేవలు మరువలేనివని బోయి న్పల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు లు పేర్కొన్నారు.బోయినిపల్లి మండలం మాన్వాడ పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా బదిలీపై వెళ్లిన మిట్టపల్లి పరుశురామ్ లకు , ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ హైస్కూల్ కు బదిలీపై వెళ్లిన రొండ్ల జగన్మోహన్ రెడ్డి అనే ఉపాధ్యాయులకు ఘనంగా బుధవారం వీడుకోలు సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలు తరగతి విద్యార్థులు ఆయా ఉపాధ్యాయుల బోధన తీరుపై వివరిస్తూ కంటతడి పెట్టారు.వీరి సేవలను ఏనాడు మరువలేమని తప్పకుండా వారు చెప్పిన విద్యాబుద్ధులకు అనుగుణంగా కొనసాగుతామని హామీ ఇచ్చారు.
హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ అధ్యక్షతన వీడ్కోలు, సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, పాటలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి.
ఉపాధ్యాయులు పరశురామ్ ,జగన్మోహన్ రెడ్డి లను పూలమాలాలతో, శాలువాలతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికాలను అందజేశారు.ఈ సందర్భంగా ఉపాద్యాయులు , విద్యార్థులు అభినందిస్తూ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం రాజిరెడ్డి, కె.శోభారాణి, కె.వెంకట హనుమాన్, వి.సురేందర్ రెడ్డి, కె మధుసూదన్.ఎ,రాథిక,పి, మోహన కృష్ణ,వసుందర , టి.మధుకర్ రెడ్డి , శమంతకమణి ,స్వర్ణలత ,పాఠశాల జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ షఫీ యొద్దీన్,సీఆర్పీలు రాంప్రసాద్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.