కాంగ్రెస్ పార్టీ వీర అభిమాని గౌస్ బాయి మరణం బాధాకరం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వీరాభిమాని ఆటో షేక్ గౌస్ బాయి పెరాలసిస్ తో మంగళవారం మరణించారు ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన మరణించడం బాధ కరమని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి , మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య లు మాట్లాడుతూ అన్నారు.కాంగ్రెస్ పార్టీ వీర అభిమాని గౌస్ బాయి కాంగ్రెస్ పార్టీలో సైనికుడిలా పనిచేశాడని ఆయన మా మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.

 The Death Of Ghouse Bhai Of The Congress Party Is Sad, Ghouse Bhai , Congress P-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఇతర పార్టీలు డబ్బులు ఏర చూపిన కాంగ్రెస్ పార్టీని ఏనాడు కూడా ఆయన వీడలేదన్నారు.కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చిన నిరుపేద కుటుంబానికి చెందిన గౌసుబాయి ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ మరోవైపు పార్టీ కోసం పని చేశారన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబాన్ని ఆదుకుంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.గౌస్ బాయ్ అంత్యక్రియల కోసం 20000 రూపాయల ఆర్థీక సహాయాన్ని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు రియాజ్ కు వారి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అందజేశారు.

అనంతరం ఆయన మృతదేహాన్ని సందర్శించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, ఉపాధ్యక్షులు వంగ గిరిధర్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, సిరిపురం మహేందర్ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ రాజు నాయక్ , వంగ మల్లారెడ్డి , రఫీక్, పొన్నాల మల్లారెడ్డి, వడ్నాల దేవయ్య , ఆనవేణి రవి, బండారి బాల్ రెడ్డి , నంది కిషన్, గుర్రపు రాములు, మెండె శ్రీనివాస్ యాదవ్, జి మల్లేశం , పందిర్ల శ్రీనివాస్ గౌడ్ ,గుడ్ల శ్రీనివాస్ , ఉప్పుల పర్షరాములు , నవీన్ నాయక్, అంతెర్పుల గోపాల్, రాంచందర్ నాయక్, గోలి పెల్లి ప్రతాప్ రెడ్డి, కనకరాజు సోషల్ మీడియా ప్రతినిధి బీపేట రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube