పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ విధానములో మార్పు

2024-25 విద్యా సంవత్సరమునకు గాను రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) లోని అర్హులైన ఎస్సీ విద్యార్ధుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేత నముల నమోదుకు సంబంధించి నూతన విధి విధానాలు కేంద్ర ప్రభుత్వ మార్గధారృకాలకు అనుగుణంగా e-pass వెబ్ సైట్ నందు మార్పు చేయడం జరిగిందని, దీని ప్రకారం ప్రతి అర్హుడైన విద్యార్ధి పేరు S.S.C మెమోలో ఉన్న విధంగానే ఆధార్ నందు ఉండాలని, విద్యార్థి ఆదాయ పరిమితి రూ.2,00,000/- నుండి రూ.2,50,000/- లకు పెంచడం జరిగిందనీ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి మెట్టు విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

 Change In Post Matric Scholarships Policy, Rajanna Sirisilla District, Demo Aut-TeluguStop.com

E-Pass లో నమోదు ప్రక్రియ:

1.మొదటి దశ Demo Authentication:

మొదటగా విద్యార్థి ఇంటర్నెట్ సెంటర్ నందు S.S.C వివరాలు, ఆధార్ కార్డ్ వివరాలు సరిపోలిన తర్వాత మాత్రమే 12 అంకెల E-Pass ID ఇవ్వబడుతుంది.ఒకవేళ విద్యార్థి S.S.C మెమోలో పొందు పరిచిన వివరాలు ఆధార్ వివరాలతో సరిపోనియెడల దగ్గరిలోని మీసేవ కేంద్రం లొ ఆధార్ వివరాలు సరిచేసుకొనవలెను.

2.రెండవ దశ:

Bio-Metric చేయడం: తదుపరి అట్టి E-Pass ID నెంబర్ తో దగ్గరిలోని మీసేవ కేంద్రం వద్ద బయో మెట్రిక్ వేయవలసి ఉంటుంది.

3.మూడవ దశ Scholarship Registration:

బయో మెట్రిక్ అనంతరం విద్యార్థి దగ్గరిలోని ఇంటర్నెట్ సెంటర్ ను సంప్రదించి పూర్తి స్థాయి నమోదు ప్రక్రియ పూర్తి చేసి సంబంధిత ధృవ పత్రాలు జతపరచి సంబంధిత కళాశాలలో సమర్పించాలని, ఇట్టి విషయమై ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాల ప్రధానాచార్యులు వారి కళాశాలలోని విద్యార్ధినీ, విధార్ధులకు ఈ నమోదు ప్రక్రియ పైన అవగాహాన కల్పించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube