ఎన్నికల కౌంటింగ్ కు సిబ్బంది సంసిద్ధం కావాలి - జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 3న నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పగడ్బందీగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.సోమవారం కలెక్టరెట్ కాన్ఫరెన్స్ హల్ లో రెండు నియోజకవర్గాలలో కౌంటింగ్ విధులు నిర్వహించే కౌంటింగ్ సహాయ, కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా తరగతులు నిర్వహించి కౌంటింగ్ నిర్వహణ పై ఎన్నికల సంఘం నిబంధనలను వివరించారు.

 Staff Should Be Ready For Election Counting - District Election Officer Anurag J-TeluguStop.com

కౌంటింగ్ సిబ్బంది సందేహాలను నివృత్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి

డిసెంబర్ 3న తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారని తెలిపారు.

ఎన్నికల నియమావళి పై రూపొందించిన మాన్యువల్ పై పూర్తి అవగాహనను ఏర్పరచుకొని పగడ్బందీగా పోస్టల్ బ్యాలెట్ , ఈవిఎం లలోని ఓట్ల లెక్కింపు జరపాలన్నారు.అంతకుముందు ఎన్నికల మాస్టర్ ట్రైనర్ లు కౌంటింగ్ విధానం , ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటింగ్ సిబ్బందికి వివరించారు.

ఈ శిక్షణ తరగతులలో జడ్పీపీ సీఈఓ గౌతమ్ రెడ్డి ,ఎన్నికల శిక్షణా పర్యవేక్షణ నోడల్ అధికారి పిబి శ్రీనివాస చారి, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube