రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నిరుద్యోగి నవీన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆవునూరి దయాకర్ రావు,సిరిసిల్ల పట్టణ కో ఆర్డినేటర్ తీగల శేఖర్ గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి,నవీన్ ఆత్మకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
అలాగే తెలుగుదేశం పార్టీ పక్షాన నవీన్ కుటుంబానికి 25 కేజీ ల బియ్యంను పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇరుకుల్ల భాస్కర్,జెట్టి కొమురయ్య, పండుగ స్వామి,బింగి వేంకటేశం తదితరులు ఉన్నారు.