జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలో రైతుల కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రుణాలు వంటి సంక్షేమ పథకాల అందిస్తున్నారని, ఈ తరుణంలో రైతులు నకిలీ విత్తన ముఠాల బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉందని,అందులో భాగంగా జిల్లా పోలీస్ శాఖ,వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆదివారం నాడు జిల్లాలోని విత్తన,ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

 Strict Action On Transportation And Sale Of Fake Seeds In Rajanna Sircilla Distr-TeluguStop.com

జిల్లాలో ఎవరైన వ్యాపారస్థులు,సంస్థలు,వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ 87126 56411 లేదా డయల్100 కి లకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రైతులను కోరారు.

సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంటాయన్నారు.

వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యాపారులు,మధ్యదలారీలు రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నాలు చేసే వారి సమాచారాన్ని పోలీసు అధికారులు అప్రమత్తతో సేకరించి కఠినంగా వ్యవహరిస్తున్నామని,రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు.

జిల్లాలో లైసెన్స్ లు లేకుండా వ్యాపారం చేసే వారిపై ,నకిలీ విత్తనాల,ఎరువుల విక్రయాలపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతారని చెప్పారు.నకిలీ విత్తనాల సరఫరా,విక్రయాల వ్యవహారంలో ప్రత్యక్షంగా కాని పరోక్షంగా సంబంధం ఉన్న వ్యాపారులు,వ్యక్తులు,సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.2021 సంవత్సరంలో నకిలీ విత్తనల అక్రమ రవాణా చేస్తూ రైతులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల మీద పిడి యాక్ట్ పెట్టడం జరిగిందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube