ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ చేపట్టాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలింగ్ సిబ్బంది దే నని సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ అన్నారు.బుధవారం సిరిసిల్ల నియోజకవర్గం కు సంబంధించి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో , వేములవాడ నియోజకవర్గం కు సంబంధించి వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్, ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు, ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.

 Election Polling Should Be Conducted In A Transparent Manner As Per The Election-TeluguStop.com

మణిగండసామి లు పరిశీలించారు.ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ….

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ ను నిర్వహించాలనీ చెప్పారు.ఉదయం 05.00 గంటలకే మాక్ పోలింగ్ చేపట్టాలన్నారు.ఉదయం 07.00 గంటలకు వాస్తవ పోలింగ్ ప్రారంభించాలని చెప్పారు.

ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని నివేదించాలనీ అన్నారు.

ఈవిఎంలకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనా, ఏమైనా సెక్టార్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు నివేదించాలని చెప్పారు.పోలింగ్ ముగిసిన అనంతరం నిబంధనల మేరకు సీల్ వేసి రిసెప్షన్ కేంద్రాలలో అప్పగించాలనీ చెప్పారు.

కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధు సూదన్ తదితరులు పాల్గొన్నారు.సజావుగా ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ.ఎన్నికల సామాగ్రి పంపిణీ కి పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో బుధవారం పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగింది.నియోజవర్గాల కేంద్రంలోని పంపిణీ కేంద్రం నుండి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపిఓ లు తమ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఎన్నికల సామాగ్రి తీసుకొని ప్రత్యేకించిన వాహనంలో పోలింగ్ కేంద్రాల కు బయలు దేరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube