మహాత్మా జ్యోతిరావు పూలే డిగ్రీ కళాశాల సందర్శించిన మాజీ ఎంపీటీసీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో సాయిబాబా మందిరం వెనక మహాత్మా జ్యోతిరావు పూలే బిసి డిగ్రీ కళాశాల ఆగస్ట్ ఒకటవ తేదీన ప్రారంభం కాగ అట్టి డిగ్రీ కళాశాల ను ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.2022 వ సంవత్సరంలో ఇట్టి డిగ్రీ కళాశాల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా స్థలం కొరత కారణంగా ఇట్టి కళాశాలను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో నడిపించారు.కాగ ఈ ఏడాది ఎల్లారెడ్డి పేట కు 2023-2024 వ విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి వారంలోనే అద్దె భవనంలో దీనిని ప్రారంభించారు.వాస్తవానికి డిగ్రీ కళాశాల ఏర్పాటు కాగా ఈ ఏడాది ఇంటర్ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.

 Former Mptc Visited Mahatma Jyoti Rao Phule Degree College, Former Mptc Oggu Bal-TeluguStop.com

ప్రస్తుతం ఇంటర్ లో 68 మంది,డిగ్రీ లో 32 మంది విద్యార్థులు చదువుకుంటు న్నారు.గత ఏడాది మహేశ్వరం లో డిగ్రీ కళాశాల తరగతులు జరిగిన సందర్భంలోనే అక్కడి విద్యార్థులను కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ లో డిగ్రీ పరీక్షలు విద్యార్థులతో రాయించినట్లు హాస్టల్ డిప్యూటీ వార్డెన్ అనిల్ తెలిపారు.

విద్యార్ధుల కు హాస్టల్ వసతి పై అడుగగా అన్ని మంచిగా ఉన్నాయని విద్యార్థులు అన్నారు.ఎవరైనా డిగ్రీ అడ్మిషన్ లు పొందాలనుకుంటే దోస్తు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ వార్డెన్ అనిల్ తెలిపారు.

తమకు ఇక్కడి కళాశాల పక్కన మురికి కాలువ ద్వారా ఇబ్బంది అవుతుందనీ మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు.

తరగతి గదులలోకి దోమలు వస్తున్నాయని చెప్పగా తరగతి గదుల నుండి బయట నుండి లోపలికి దోమలు రాకుండా జాలి ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

ప్రతి గ్రూప్ లో 40 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా మొత్తం 120 మంది కి 68 మంది ఉన్నారు.ఇంటర్ లో బైపిసి,ఎంపీసీ, సీఈసీ గ్రూపులు నడుస్తున్నాయని డిగ్రీలో బిజెడ్ సి,ఎంపీసీ,బి కాం (సి ఎ)గ్రూప్ లలో 120 మందికి 32 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.దోమల బెడద నుండి తప్పించడానికి ఫాగింగ్ చేపిస్తానని విద్యార్థులతో అన్నారు.2024-2025 వ విద్యా సంవత్సరం లో డిగ్రీ లో పూర్తి స్థాయిలో అడ్మిషన్ లు జరిగేలా చూడాల్సిన భాధ్యత మండలంలోని అన్ని రాజకీయపార్టీల నాయకులు, విద్యావంతులు సహకరించాలని ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు.శాశ్వత భవన నిర్మాణానికి త్వరలోనే స్థలం ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి పంపిస్తానని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube