కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలు

రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన బీజేపీ నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్ల కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.బీజేపీ( BJP ) నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

 Tension At The Collectorate Bjp Leaders Tried To Besiege , Bjp-TeluguStop.com

కొందరు నేతలు కలెక్టరేట్ కార్యాలయంలోకి చోచ్చుకుపోగా, రెండో గేటు వద్ద పోలీసులు వారిని పూర్తిగా అడ్డుకున్నారు.అనంతరం, కలెక్టరేట్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలను అదుపులోకి తీసుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.

భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఏ రంగంలో చూసినా దౌర్భాగ్యమైన స్థితిలో ఉందన్నారు.ప్రజలను అణిచివేతకు గురిచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చామని నిరసనకు దిగితే, దేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో పోలీసులు నిర్బంధ వ్యవస్థ ఉందన్నారు.ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తుందన్నారు.

కాబోయే సీఎం కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో పోలీసు నిర్బంధ మరీ ఎక్కువగా ఉందన్నారు.ఏ ఆశయం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, సీఎం కేసీఆర్ ఒక్క ఆశయాన్ని కూడా నెరవేర్చలేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు కొలగొట్టిందన్నారు.దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్, మాట తప్పాడని ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.మద్యం షాపులకు మూడు మాసాల గడువు ఉన్నప్పటికీ టెండర్లు ప్రకటించి రూ.రెండు వేల కోట్లకు పైగా, ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుని, ప్రభుత్వ భూములు అమ్ముకొని ప్రభుత్వం నడిపే ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి తెలంగాణ ప్రజలు మరో ఉద్యమం చేయవలసి వస్తుందన్నారు.

ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీజేపీ విశ్రమించబోదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షాన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిశెట్టి శ్రీనివాస్, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, పార్లమెంట్ ఉప కన్వీనర్ ఆడేపు రవీందర్, జిల్లా అధికార ప్రతినిధులు అన్నల్దాస్ వేణు, బర్కమ్ నవీన్ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube