రాజన్న సిరిసిల్ల జిల్లా : యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్,బోయినపల్లి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ లు అన్నారు.బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన దోస్తీ మీట్ – 2024 కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, అదే ఉద్దేశ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, మాధకద్రవ్యాల వలన కలుగు అనార్దలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు దోస్తీ మీట్ – 2024 లో భాగంగా
ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రీడల్లో మండల స్థాయిలో గెలుపొందిన జట్లు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటాయనీ అన్నారు.
యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తి ని నిజ జీవితంలో అలవర్చుకుంటు ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా, ఆరోగ్యం గా దృడంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు.
నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు.కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య ,గంగారం, సిబ్బంది తిరుపతి పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు.