17వ పోలీస్ బెటాలియన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

“యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు:: కమాండెంట్ కె.సుబ్రమణ్యం.

 Women's Day Celebrations In 17th Police Battalion , 17th Police Battalion, Women-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ లో సోమవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బెటాలియన్ కార్యాలయ మహిళా సిబ్బంది యొక్క సేవలను గుర్తించి వారిని అభినందించడం జరిగింది.

ఈ సందర్భంగా కమాండెంట్ కె.సుబ్రమణ్యం మాట్లాడుతూ ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, స్త్రీల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తుగా ప్రపంచం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది అని తెలిపారు.ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలు సాధించిన విజయాలను జరుపుకోవడానికి మాత్రమే కాకుండా లింగ పక్షపాతం, అసమానతలను రూపుమాపడానికి, సమ సమాజాన్ని సృష్టించడానికి అందరూ కట్టుబడి ఉండాలని కమాండెంట్ సూచించారు.

ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube