రెండు గంజాయి కేసులో ముగ్గురు నిందుతుల అరెస్ట్,రిమాండ్ కి తరలింపు

ఈ సందర్భంగా సి.ఐ మొగిలి మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలానికి చెందిన వివేక్, వేణు అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి తాగడానికి అలవాటు పడి తంగాళ్లపల్లి గ్రామానికి చెందిన క్రాంతి వద్ద గంజాయి( Marijuana ) కొనుగోలు చేసి ఆ గంజాయి తాగుతూ మిగిలిన గంజాయి అమ్మడానికి వివేక్, వేణు ఇద్దరు వ్యక్తులు తంగాళ్లపల్లి మండలంలోని అంబగుడి వద్దకి వస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను నిన్నటి మంగళవారం మధ్యాహ్నం సమయంలో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని వారిని విచారించగా వారు తంగాళ్లపల్లి గ్రామానికి చెందిన క్రాంతి వద్ద వారికి అవసరం ఉన్నప్పుడల్లా కొనుగోలు చేసి తాగగా మిగిలిన గంజాయి అమ్ముకుంటున్నాం అని చెప్పగా , తంగాళ్లపల్లి ఎస్.

 Three Accused Arrested In Two Ganja Cases, Sent To Remand-TeluguStop.com

ఐ సుధాకర్ తన సిబ్బందితో మంగళవారం రోజున మధ్యాహ్నం సమయంలో క్రాంతి ఇంట్లో తనిఖీ చేపట్టి అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్క స్వాధీనం చేసుకొని ఈ రోజు ముగ్గురు గంజాయి నిందుతులను రిమాండ్ కి తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి తెలిపారు.

ప్రజలు ఎవరైనా గంజాయి కి సంబంధించిన సమాచారం డయల్100 లేదా టాస్క్ఫోర్స్ సి.ఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి సమాచారం అందించగలరని,యువత డ్రగ్స్ భారిన పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని,జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్( Special drive ) లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని, *2024 సంవత్సరంలో ఈ రోజు వరకు జిల్లాలో 47 కేసులలో 121 మందిని అదుపులోకి 31.80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube