బిగ్ బాస్ సీజన్8 లో అమృత ప్రణయ్ అంటూ ప్రచారం.. ఆమె ఎంట్రీ ఇస్తే రచ్చరచ్చే!

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారంలో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) మొదలవుతుందనే సంగతి తెలిసిందే.ఈ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

 Amruta Pranay Is In Bigg Boss Show Season8 Details Here Goes Viral In Social M-TeluguStop.com

బిగ్ బాస్ షో సీజన్8 కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ సీజన్8 లో అమృత ప్రణయ్( Amrutha Pranay ) అంటూ ప్రచారం జరుగుతుండగా ఆమె ఎంట్రీ ఇస్తే రచ్చరచ్చే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమృత ప్రణయ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది.ప్రేక్షకుల్లో సైతం ఆమెపై సానుభూతి ఉంది.బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆమె కూడా ఒకింత ఆసక్తి కనబరుస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం బిగ్ బాస్ షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

అమృత ప్రణయ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గతంలో అమృత ప్రణయ్ బెదురులంక 2012 మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని వార్తల్లో నిలిచారు.బుల్లితెర షో బిగ్ బాస్ షో సీజన్7 మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్8 పై అంచనాలు పెరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్8 ను ఇన్ఫినిటీ అని ప్రచారం చేస్తుండగా సీజన్8 లో ఎంటర్టైన్మెంట్ కూడా అన్ లిమిటెడ్ అని తెలుస్తోంది.

సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రసారమయ్యే ఛాన్స్ ఉంది.వేణుస్వామి( Venu Swamy ) బిగ్ బాస్ షోలో పాల్గొంటారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజం లేదని వేణుస్వామి వెల్లడించారు.

బిగ్ బాస్ 8 షోలో పాల్గొనే సెలబ్రిటీలకు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.బిగ్ బాస్ షో కోసం ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube