పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజాసంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలి-మల్లారపు అరుణ్ కుమార్

పోడు భూముల పోరాటం( Podu Land Pattas )లో పాల్గొన్న ప్రజాసంఘ నాయకుల పై కేసులు ఎత్తివేయాలిని ప్రజాసంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్( Mallarapu Arun Kumar ) ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కోర్టులో హాజరయ్యారు.

 Cases Should Be Dropped Against Community Leaders Involved In The Struggle For P-TeluguStop.com

అనంతరం నాయకులపై పెట్టినా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిరిసిల్ల లో ప్రజాసంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.

పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్ తో పోరాడిన ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు.
పోడు రైతుల పక్షాన నిలబడిన ప్రజా సంఘాల నాయకులపై కూడా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.50 సంవత్సరాలనుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ భూమిలేని నిరుపేద కుటుంబాలకు( Poor Families ) ప్రభుత్వ వెంటనే హక్కు పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.హక్కు పత్రాలు ఇవ్వకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జాలపల్లి మనోజ్ కుమార్, ఇసంపెల్లి కొమురయ్య, జింక పోషయ్య, గుర్రపు నరేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube