ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజవర్గంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ ఏరియా ఆసుపత్రి నీ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి ఆదివారం పరిశీలించారు.

 The Aim Is To Provide Better Healthcare To All Mla Adi Srinivas, Healthcare , M-TeluguStop.com

ఈ సందర్భంగా దవాఖానలోని పలు వార్డులు, ప్రసూతి విభాగం, పాలియేటివ్ కేర్, మేల్ వార్డ్ లు తనిఖీ చేశారు.ఆయా వార్డుల్లో రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు.

పలువురు బాలింతలతో మాట్లాడారు.అనంతరం వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

దవాఖానలో వైద్యులు, సిబ్బంది ఎందరు ఉన్నారో పోస్టుల వివరాలు తెలుసుకున్నారు.ఇంకా ఎందరు కావాలో దవాఖాన బాధ్యులను ఆరా తీశారు.వేములవాడ ఏరియా ఆసుపత్రిలో కావాల్సిన వసతుల పై ఆరా తీసి, వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  సీటీ స్కాన్ యంత్రం వాడుతున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు.దానికి కావాల్సిన ఏర్పాట్లపై వివరాలు తీసుకున్నారు.పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులో ఉన్నాయని విప్ స్పష్టం చేశారు.ప్రతి రోజూ ఎంత మంది రోగులు వస్తున్నారని?  గత నెలలో మొత్తం ఎంత మంది వచ్చారు? ఇన్ పేషెంట్ ఎందరు అయ్యారు? క్యాంటీన్ నడుస్తున్నాదా?  అని ఆరా తీశారు.

ఈ సందర్భంగా పోస్ట్ మార్టం చేసేందుకు కేటాయించిన గదిని విప్, కలెక్టర్ పరిశీలించారు.

 పోస్ట్ మార్టం సేవలు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు.గైనకాలజిస్ట్, ఈ ఎన్ టీ, ఎముకల, జనరల్ సర్జన్ వైద్యుల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఆర్తో డాక్టర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పూర్తిస్థాయిలో ఆపరేషన్లు కూడా చేస్తారని స్పష్టం చేశారు. బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని వైద్యులను, అధికారులను ప్రభుత్వ విప్ ఆదేశించారు నియోజకవర్గంలోని ప్రజలందరూ వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇక్కడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీఎంహెచ్ఓ వసంతరావు, డీసీహెచ్ఎస్ పెంచలయ్య, ఇంచార్జ్ సూపరిండెంట్ సంతోష్ చారి, డాక్టర్లు ప్రవీణ్, శ్రీనివాస్, వేములవాడ అర్బన్ తాసిల్దార్ మహేష్ కుమార్, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube