పోలీస్ వాహనాల నిర్వహణ బాధ్యతాయుతంగా ఉండాలి.

ఈ రోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలోని పోలీస్ పోలీస్ అధికారుల వాహనాల డ్రైవర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని విధి నిర్వహణతో పాటించవలసిన అంశాలపై దిశ నిర్దేశం చేశారుఅనంతరం పోలీస్ వాహనాల డ్రైవర్ల సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించి వారితో పాటుగా కంటి పరీక్షలు చేపించుకున్న ఎస్పీ .

 The Maintenance Of Police Vehicles Should Be Responsible , Police, District Sp-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ( District SP Akhil Mahajan, ) మాట్లాడుతూ…అత్యవసర సమయాలలో పోలీసులు సంఘటనా స్థలాలకు త్వరగా వెళ్లే క్రమంలో డ్రైవర్ల బాధ్యత చాలా ముఖ్యమని అందుకే ప్రతి ఒక్కరి కంటి చూపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాలోని అన్ని పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఎల్ .

వి ప్రసాద్ సిరిసిల్ల వారి సహకారంతో కంటి వైద్య పరీక్షలు చెపిస్తున్నామని తెలిపారు.వైద్య పరీక్షలలో లోపం ఉన్న వారికి అవసరమైన చికిత్స తీసుకునేలా సూచనలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ అందరికి ఆదర్శంగా ఉండాలని అదే సమయంలో పోలీస్ వాహనాన్ని చూస్తేనే పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్టను పెరిగే విధంగా వాహనాల నిర్వహణ ఉండాలని ఆయన అన్నారు.పోలీస్ ఉద్యోగం అత్యవసర సేవలలో ముఖ్యమైనది కాబట్టి డ్రైవర్లంతా అధికారులు సూచించిన విధంగా సమయ పాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ముందుండాలని సూచించారు.

డ్రైవర్లంతా వాహనాలలో ఇంజన్ ఆయిల్ మొదలుకొని, స్పేర్ పార్టులు, వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం లాంటి విషయాలలో జాగ్రత్తలు పాటిస్తూ వాహనాన్ని సొంత వాహనంగా చూసుకోవాని అన్నారు.పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్న వాహనాలను కండిషన్ లో ఉంచుతూ, నిర్వహణ సక్రమంగా ఉన్న వాహనాలను గుర్తించి సంబంధిత డ్రైవర్లకు ఎస్పీ అభినందించి ప్రసంశ పత్రాలు అందించారు.

ఎస్పీ వెంట ఆర్.ఐ మాధుకర్, యాదగిరి, ఆర్.ఎస్.ఐ రాజు, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube