ఫిట్నెస్ లేని ప్రైవేటు కళాశాల పాఠశాల బస్సుల పై చర్యలు తీసుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఫిట్ నెస్ లేని ప్రవేట్ పాఠశాల, కళాశాలలా బస్సుల పై చర్యలు తీసుకోవాలని జిల్లా డి టి ఓ కు ఏబీవీపీ ( ABVP )ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్( Ranjith Kumar ) మాట్లాడుతూ జిల్లాలో ఫిట్ నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల జీవితలతో చెలగాటం ఆడుతున్నాయన్నారు.

 Action Should Be Taken Against Unfit Private College School Buses ,abvp, Privat-TeluguStop.com

పాఠశాల,కళాశాలలా బస్సుల పై చర్యలు తీసుకోవాలని, బస్సులు ఫిట్ నెస్ లేకపోవడం వల్ల ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారని, గతంలో జిల్లాలో అనేక ప్రమాదలు జరిగాయన్నారు.రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట్ మండలంలోని శ్రీ చైతన్య పాఠశాల స్కూల్ బస్సు ఆర్ టి సి బస్సు ను అజాగ్రత్తతో నడపడం తో ప్రమాదం జరిగేదే ఆర్ టీ సి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని నుండి రక్షించారు.

తృటిలో ప్రమాదం తప్పింది.ఈ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు.

జిల్లాలో అన్ని ప్రవేట్ పాఠశాల, కళాశాల లా బస్సుల పైన నిఘా పెట్టి రూల్స్ వ్యతిరేకంగా నడుస్తున వారిపైన చర్యలు తీసుకోగలరని ఏబీవీపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.లేనిపక్షంలో డిటిఓ కార్యాలయంని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, విభాగ్ లా ఫోరమ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, ఏబీవీపీ వింగ్,ఎస్ ఎఫ్ డి జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు రావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube