జిల్లాలో గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త..

రాజన్న సిరిసిల్ల జిల్లా : గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రతి పోలీస్ స్టేషన్ లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు.ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ, సిరిసిల్ల టౌన్ సి.

 Ganja Smokers In The District Should Beware, Ganja Smokers , Rajanna Sircilla Di-TeluguStop.com

ఐ లతో కలసి గంజాయి కిట్ల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ. జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించి గంజాయి సేవించినవారు మరియు వారికి సరఫరా చేసిన 08 మందిపై కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి ,05 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేయడం జరిగిందని, గంజాయికి అలవాటు పడి తాగేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండలని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పింస్తుదని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు.గంజాయి మత్తు పదార్థాలను అక్రమ రవాణాకు చెక్ పెడుతూ గంజాయిని పట్టుకుంటున్నారే గాని వాటిని సేవించే వారిని గుర్తించడం కష్టంగా మారిందని,ఈ నేపధ్యంలో తెలంగాణ పోలీస్ గంజాయి తాగే వారిని గుర్తించడానికి అన్ని పోలీస్ స్టేషన్లలోకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకవచ్చాయని డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే,గంజాయి టెస్ట్ లు నిర్వహించి వాటికి బానిసైన వారిని పట్టుకోవడం జరుగుతుదన్నారు.

జిల్లాలో గంజాయి సేవించేవారు ఇకనుంచి పోలీసుల చేతిలో తప్పించుకోలేరని హెచ్చరించారు.జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో గతంలో గంజాయి కేసులల్లో నిందుతులుగా ఉన్న వారు వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా అనే నేపధ్యంలో,అనుమాస్పదంగా తిరుగుతు కనపడిన వారిని సిరిసిల్ల, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట్, గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లలో గంజాయి కిట్స్ తో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిన వారిని మరియు వారికి గంజాయి సరఫరా చేసిన వారిని 08 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 390 గ్రాముల గంజాయి,05 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube