జిల్లాలో సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీస్ నజర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :సోషల్ మీడియా( Social media )లో వైరల్ కావడానికి నిషేధిత ఆయుధాలతో, వాహనాలపై ప్రమాదకర విన్యాసాలతో రీల్స్ , వీడియోలు, ఫోటో ల పేరుతో చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో సోషల్ మీడియా పై 24/7 పోలీస్ నజర్ ఉంటుందని సిరిసిల్ల డిఎస్పీ( Sirisilla DSP ) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ….

 Police Nazar On Social Media Posts In The District-TeluguStop.com

కొంత మంది యువకులు వైరల్ కావడానికి వివిధ సందర్భలలో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలుగచేసేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ నిషేధిత ఆయుధాల చేత పట్టుకొని వీడియోలు, ఫోటోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ( ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్) లలో పోస్ట్ చేసి చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారాని అలాంటి పోస్ట్ లు చేసే వారిపై జిల్లా పోలీస్ 24/7 నిఘా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుదన్నారు.సిరిసిల్ల పట్టణ పరిధిలో కొంత మంది యువకులు వైరల్ కావడానికి వాహనాలపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వీడియోలు ఫోటిస్ తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం జరుగుతుందని అలాంటి వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

సోషల్ మీడియా ఇతరుల పట్ల అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టిన , మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధముగా పోస్ట్ లు పెడుతు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారితో పాటుగా అడ్మిన్ లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

బుధవారం రోజున సిరిసిల్ల( Sircilla ) పట్టణ కేంద్రంలో తోటిచర్ల సాయి వర్ధన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొన్ని రోజుల క్రిందట తల్వార్ తో ,కత్తితో విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాగా సాయి వర్ధన్ పై కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనం, ఒక కత్తి స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube