వేములవాడ జూనియర్ కళాశాలలో వసతులు పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, భవనం, స్విచ్ బోర్డ్స్, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, టాయిలెట్స్, కళాశాల మైదానం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

 Collector Sandeep Kumar Jha Inspected The Facilities In Vemulawada Junior Colleg-TeluguStop.com

గతేడాది ఇంటర్ ఫలితాలపై ఆరా తీశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

కళాశాల మైదానంలో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.తరగతి గదులు, ఆవరణలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

కళాశాలలో కావాల్సిన సౌకర్యాలపై ఒక నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతామని కలెక్టర్ తెలిపారు.

ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమోద్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube