రైతుల కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యం : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా :రైతుల కళ్లలో ఆనందం చూడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Vemulawada MLA Adi Srinivas ) తెలిపారు.కోనరావుపేట మండలం(Konaraopet ) నిజామాబాద్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

 The Aim Is To See Happiness In The Eyes Of Farmers: Vemulawada Mla Adi Srinivas-TeluguStop.com

అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడారు.

జిల్లాలోని 23వేల పై చిలుకు రైతులకు దాదాపు రూ.137 కోట్లు మాఫీ కానున్నాయని వెల్లడించారు.ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతుందని పేర్కొన్నారు.

వ్యవసాయ భూమి ఉండి, పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు బ్యాంక్ లో రుణం తీసుకుంటే కచ్చితంగా రుణ మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.

రైతులకు సాగులో నూతన పద్ధతులు, యంత్ర పరికరాలు వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు అందించేందుకు రైతు వేదికల్లో రైతు నేస్తం పేరిట కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఇక్కడ ఆర్డీవో రాజేశ్వర్, డీఏఓ భాస్కర్, మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube