పెట్రోల్ బాటిల్ తో తహశీల్దార్ ఆఫీస్ ముందు వికలాంగ రైతు నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా: కొంత మంది బడా నేతల పేర్లు చెప్పి తన వ్యవసాయ భూమిపై జులుం చూపుతున్నారని ఆరోపిస్తూ తహశీల్దార్,ఎస్ఐ లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో శుక్రవారం పెట్రోల్ బాటిల్ తో వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ఓ వికలాంగ రైతు తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.

 Disabled Farmer Protests In Front Of Tehsildar Office With Petrol Bottle, Disabl-TeluguStop.com

రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన బోయిని అంజయ్య అనే వికలాంగ రైతు సర్వే నెంబర్ 346 లోని వ్యవసాయ భూమికి కడీలు ఏర్పాటు చేసుకున్నాడు.కొంతమంది వ్యక్తులు అధికార,అంగ,ధన బలం బలంతో పాతిన కడీలను దౌర్జన్యంగా విరగ్గొట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని,

తహసిల్దార్, ఎస్ఐలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో తనకు న్యాయం జరగదని భావించిన బాధితుడు పెట్రోల్ బాటిల్ తో తాహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు.

దీనితో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈ ఘటనపై స్పందించిన ఎస్ఐ పి.మల్లయ్య రైతు భూమిలో కడీలు విరగ్గొట్టిన వారిపై వెంటనే కేసు నమోదు చేస్తామని రైతుకు హామీ ఇచ్చి, నచ్చజెప్పి నిరసన విరమింపచేశారు.అనంతరం తాహశీల్దార్ లాల్ బహుదూర్ స్పందిస్తూ సోమవారం వరకు రైతు సమస్యను పరిష్కరిస్తానని రైతుకు హామీ ఇచ్చారు.

ఇప్పటికైనా అధికారులు రైతుల పక్షాన నిలబడి ఆక్రమణలకు గురవుతున్న భూములు కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube