రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆన్లైన్ మార్కెటింగ్ ,చైన్ మార్కెటింగ్(గొలుసుకట్టు))( Online Marketing, Chain Marketing ) మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆన్-లైన్ & మల్టీ లెవల్ మార్కెటింగ్ ,చైన్ (గొలుసుకట్టు) మార్కెటింగ్ ల పేరుతో మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని,తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ మోసపూరిత ప్రచారాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఈజీ మనీ ఆశలో పడి మోసపోవద్దన్నారు.ఆన్లైన్ ట్రేడింగ్ లో ,గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటు, కొన్ని గంటల్లో రెట్టింపు నగదు ఇస్తామంటూ,బహమతులు ఇస్తామంటూ ఆశావహులకు సైబర్ మోసగల్లు యెర వేసి కుచ్చుటోపీ పెడుతున్నారని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తత ఒక్కటే అత్యుత్తమ మార్గం జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లా పరిధిలో నమోదైన సైబర్ కేసుల వివరాలు.
1.Wwake అనే యాప్ లో ఒక పది వేల రూపాయలు డిపాజిట్ చేసినచో రోజుకు 500 రూపాయల చొప్పున 20 రోజులలో ఆ అమౌంట్ డబల్ అవుతాయని చెప్పి నమ్మించి మొదటగా ఈ అమౌంట్ ని రిఫండ్ ఇవ్వడం జరిగింది తరువాత ప్రజలందరూ నమ్మి ఎక్కువ మొత్తంలోలక్షల్లో పెట్టుబడి పెట్టించి ఈ యాప్ ని ఎత్తివేసి చాలామంది ప్రజల్ని మోసగించడం జరిగింది
2.Tranzindia అనే కంపెనీలో ఉద్యోగాల పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం చేయడం జరుగుతుంది ప్రజలకు ఉద్యోగం పేరుతో లోకల్ యాప్ లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వారి నుండి 9500 కట్టించుకొని వారికి ఒక ఐడి క్రియేట్ చేసి వారిని ఇంకా కొంతమందిని జాయిన్ చేస్తే కమిషన్ వస్తుందని చెప్పి దానినే పార్ట్ టైం జాబ్ అని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసగించడం జరిగింది.
3.DAAI అనే యాప్ లో ఒక పది వేల రూపాయలు డిపాజిట్ చేసినచో రోజుకు 500 రూపాయల చొప్పున 30 రోజులలో ఆ అమౌంట్ డబల్ అవుతాయని చెప్పి నమ్మించి మొదటగా ఈ అమౌంట్ ని రిఫండ్ ఇవ్వడం జరిగింది ,ఈ యాప్ ను వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టుమెంట్ చేస్తే కొంత నగదు మీ అకౌంట్ కి వస్తుంది అని చెప్పి తరువాత ప్రజలందరూ నమ్మి ఎక్కువ మొత్తంలో లక్షల్లో పెట్టుబడి పెట్టించి ఈ యాప్ ని ఎత్తివేసి చాలామంది ప్రజల్ని మోసగించడం జరిగింది ,ఇదే యాప్ ని పేరు మార్చి THIRDIEYE AI మోసం చేయాలని చూస్తున్నారు.
4.Discovery prestige.com లో ఇన్వెస్ట్ చేస్తే ఒక రోజులోనే అమౌంట్ రెట్టింపు అవుతాయని అలాగే నమ్మించి ఇన్వెస్ట్మెంట్ చేపించారు అలా వాళ్ళ ప్రమోట్ చేస్తు ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందంటూ నమ్మిస్తారు.