భీమ్ ప్రతిభ పురస్కారం ప్రధానం

రాజన్న సిరిసిల్ల జిల్లా: భీమ్ యువత అధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, చదువులో ప్రతిభ కనబర్చిన 6-10 తరగతి, ఐఐఐటి లో సీట్ సాధించిన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డిపేట విద్యార్థులకు, పాఠశాలకు భీమ్ ప్రతిభ పురస్కారం భీమ్ ఎక్సెలెన్స్ అవార్డు అందించటం జరిగింది.ఈ కార్యక్రమంలో భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని అన్నారు.

 Bheem Excellence Award Presented To Talented Students In Ellareddy Peta, Bheem E-TeluguStop.com

స్వాతంత్ర దేశంలో, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరూ అందుకోవాలంటే, విద్య ఎంతో అవసరం అని , అట్టి విద్యలో అంబేడ్కర్ లాగా ఉన్నత స్థాయికి వెళ్లి, ఈ దేశ అభ్యున్నతికి పాటుపడాలని, చదువు నేర్చుకునే స్థాయి నుండి, చదువు చెప్పే స్థాయికి, ఓటు వేసే స్థాయి నుండి ఓటు వేయించుకునే స్థాయికి, చప్పట్లు కొట్టే స్థాయి నుండి చప్పట్లు కొట్టించుకునే స్థాయికి, విద్యార్థులు ఎదగాలన్నారు.

విద్యార్థులు ప్రతి రోజు ఇంటి నుండి వచ్చేటప్పుడు మెదడులో ప్రశ్నలు నింపుకొని రావాలి అని, అవి బడిలో నివృత్తి చేసుకుని, రేపు అన్యాయాన్ని, అధర్మాన్ని, అవినీతిని, అసమానతలను ప్రశ్నించే స్థాయికి చేరుకునేల చదివినప్పుడు మాత్రమే, మన జీవితాలు వెలుగులు నింపుకుంటాయని భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో, కొత్త చెన్నయ్య, రేసు శంకర్ , లింగాల దాసు, గడ్డం వెంకటేష్, అంబటి విజయ్,కొత్త అరుణ్, లింగాల సందీప్, జాను, రాకేష్, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ , పాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి,ఎంపీటీసీ పందిర్ల నాగరాణి, ఎస్ఎంసి చైర్మన్, సభ్యులు, ఉపాద్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube