ఎన్నికల వేళా సోషల్ మీడియాపై ప్రత్యేక నజర్ - ఎస్పీ అఖిల్ మహాజన్

మంగళవారం రోజున ఇల్లంతకకుంట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు.

 Special Focus On Social Media Posts Amid Telangana Assembly Elections Sp Akhil M-TeluguStop.com

ఎన్నికల వేళ సోషల్ మీడియా వేదికగా వర్గాల మధ్య ,వ్యక్తుల మధ్య అల్లర్లు సృష్టించే వారిపై,సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్ట్ లు పెట్టేవారిపై ప్రత్యేక నజర్ పెట్టాలని,అలా జరిగినట్లు అయితే పోస్ట్ చేసే వారిపై మరియు గ్రూప్ అడ్మిన్ లపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకొని,క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు అయిన ఇల్లంతకుంట, కందికట్కూరు, గాలిపెళ్లి, అనాతరం, పెద్దలింగపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ ఏర్పాటు చేయవలసిన భద్రత చర్యలు,సీసీ కెమెరాల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ముందుగానే చూసుకోవాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా క్రిటికల్ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు, నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు.ఎస్పీ వెంట డిఎస్పీ ఉదయ్ రెడ్డి, ఎస్.ఐ సుధాకర్, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube