విదేశాల్లో ఉద్యోగాల,ఉపాధి కోసం వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దు.

జిల్లాలో ఇప్పటివరకు నకిలీ ఏజెంట్లను గుర్తించి 21 కేసులు నమోదు.గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన,ఏజెంట్లను సంప్రదించే ముందు 8712656411 నెంబర్ ను సంప్రదించాలి.

 Don't Be Fooled By Fake Agents Who Are Looking For Jobs Abroad. District Sp , A-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) :నకిలీ గల్ఫ్ ఎజెంట్లను ఎవరు నమ్మవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ ( SP Akhil Mahajan ) మాట్లాడుతూ జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు, కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని,ఉద్యోగు, ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళు యువకులు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించలని అన్నారు.

ఉపాధి,ఉద్యోగాల కోసం విదేశాలకి వెల్లేవారికి నకిలి ఏజెంట్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని,ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్ల మీద 21 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ నెంబర్ 8712656411 కి నేరుగా ఫోన్ కాల్ ద్వారా పిర్యాదు చేస్తే ఆ పిర్యాదు పై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు ఏజెంట్ పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ఉపాధి,ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళేవారు జిల్లాలోని ఏజెంట్లను సంప్రదించే ముందు వారికి సంబంధించిన పూర్తి వివరాలు అనగా ప్రభుత్వ ఏజెంట లేదా నకిలీ ఏజెంట అతని మీద ఎలాంటి కేసులు ఉన్నాయా మొదలగు సమాచారం ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు.జిల్లాలో ఉన్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు సంబంధించిన సమాచారం ఫోన్ నెంబర్ 8712656411 కు అందించాలని,తద్వారా జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని,ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ప్రజలను మోసం చేసే ఏజెన్సీల యొక్క లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టి పిడి ఆక్ట్ పెట్టడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube