జిల్లాలో ఉన్న ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ఓటు హక్కు వినియోగించుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ) అధ్యక్షతన జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం ఏసిడిపిఓ సుచరిత, సఖీ కోఆర్డినేటర్ పద్మ, డిస్ట్రిక్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ రోజా, పోషణ అభియాన్ కో ఆర్డనేటర్ బాల కృష్ణ, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్ డి ఎ నరసింహులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Transgender Persons In The District Should Exercise Their Right To Vote , Tran-TeluguStop.com

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఎదగడానికి సమాన అవకాశాలు కల్పించింది.దానిలో భాగంగా ఎన్నికల సంఘం ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.

ఆడ మగ /స్త్రీ పురుష బేధంతో పాటు ట్రాన్స్ జెండర్ పర్సన్స్ అనే విభాగాన్ని కూడా తీసుకురావడం జరిగింది.కాబట్టి ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్క ట్రాన్స జెండర్ పర్సన్స్ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ వారికి తగిన అవకాశాలు కల్పించినట్లయితే అన్ని రంగాలలో ముందుకు వెళ్తారని కాబట్టి ప్రతి ఒక్కరు అభివృద్ధి పథంలో వెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వారికి జీవనోపాధి గురించి ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు.

అలాగే ఓటు విలువను గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం వారి పేరును ఫామ్ సిక్స్ లో నమోదు చేసుకోవాలని తెలియజేశారు.అలాగే సమావేశానికి విచ్చేసిన 40 మంది ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్ కు ఓటు నమోదు పారాలను అందించి వారి చేత దరఖాస్తు చేయించడం జరిగింది .అలాగే వారిలో ఒకవేళ ఎవరైనా ఇతర నియోజకవర్గాలలో ఉంటే అక్కడికి వారి యొక్క దరఖాస్తు ఫారాలను పంపిస్తామని తెలియజేయడం జరిగింది.సమావేశంలో ట్రాన్స్ జెండర్ పర్సన్స్ నాయకులు జమునమ్మ కౌసల్య సూరమ్మ మదుష మొదలగు వారు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube