యాదాద్రి భువనగిరి జిల్లా: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన బీసీ మహాసభకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం నుండి బీసీ సంఘాల నాయకులు తరలివెళ్లారు.
వెళ్ళిన వారిలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తెలంగాణ భిక్షం, నాయకులు సూరపల్లి వెంకటేశం,ఎడ్ల సత్తయ్య, చిలువేరు శంకర్, చిలువేరు ముత్యాలు, సికిలమెట్ల ప్రభాకర్, ఏదుల తిరుమలేష్, కొప్పు రామకృష్ణ, చిలువేరు శ్రీశైలం, చిలువేరు సత్తయ్య తదితరులు ఉన్నారు.