అనూప్ రూబెన్స్.సినిమా లవర్స్ కు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.
సంగీత అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ ఆయన అందించిన సంగీతాన్ని ఇప్పటికీ ఆస్వాదిస్తుంటారు.కీబోర్డ్ ప్లేయర్ గా కెరీర్ అరంభించిన ఆయన.ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సారధ్యంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యాడు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో కీ బోర్డ్ ప్లేయర్ గా పలు అవకాశాలు వచ్చాయి.
వచ్చిన అవకాశాలన్నింటినీ ఆయన వినియోగించుకున్నాడు.సిక్స్ టీన్స్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, నువ్వు నేను, జయం, సంతోషం, దిల్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశాడు.2004 వరకు దాదాపు 200 సినిమాలకు పనిచేశాడు.
ఇక జై సినిమాతో అనూప్‌ను సంగీత దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు తేజ.ఆ సినిమాకు అనూప్ అద్భుత ట్యూన్స్ ఇచ్చాడు.ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డాడు.
అయితే ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి కానీ.సినిమా మాత్రం అంతగా ఆడలేదు.
ఈ సినిమా తర్వాత కూడా ఆయన మంచి అవకాశాలే వచ్చాయి.ధైర్యం, గౌతమ్ ఎస్ఎస్‌సీ, ద్రోణ, సీతారాముల కల్యాణం లంకలో, అందరి బంధువయా లాంటి సినిమాలకు సంగీతం అందించాడు.
అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు.మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన తర్వాత సుమారు ఏడు సంవత్సరాల పాటు తన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు.
దీంతో ఆయన మళ్లీ పలు సినిమాలకు కీ బోర్డ్ ప్లేయర్ గా పని చేశాడు.

చిరవకు ఆది హీరోగా పరిచయమైన ప్రేమకావాలి సినిమాతో అనూప్ కు మంచి హిట్ దొరికింది.అటు ద్రోణ సినిమాలో అతడు చేసిన ఏం మాయ చేశావే పాట దర్శకుడు విజయ భాస్కర్‌కు నచ్చడంతో ప్రేమకావాలి సినిమాలో అవకాశం ఇచ్చాడు.ఆ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి.సినిమా కూడా 100 రోజుల వేడుక జరుపుకుంది.ఆ తర్వాత పూలరంగడు, ఇష్క్, లవ్లీ లాంటి సినిమాలు చేసిన మంచి సక్సెస్ పొందాడు.ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం సినిమాకు సంగీతం అందించి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు అనూప్.