17వ పోలీస్ బెటాలియన్ లో బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : భారత రాజ్యాంగ పితామహుడు, భారతదేశ మెదటి న్యాయ శాఖ మంత్రి బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 17వ బెటాలియన్ సర్థాపూర్ లో బెటాలియన్ అసిస్టెంట్ కామాడెంట్ జె.రాందాస్ బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

 Babasaheb Dr Bhim Rao Ambedkar Jayanti Celebrations At 17th Police Battalion, Ba-TeluguStop.com

ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు (ముఖ్య వాస్తుశిల్పి) అని పిలుస్తారు.

స్వాతంత్య్రానంతరం దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.

అంబేద్కర్ కి మరణానంతరం 1990లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి విశిష్టమైనది.

దళితుల హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి పోరాడారు.గుర్తించదగిన సంఘటనలలో సమానత్వ జంట, మూక్ నాయక మొదలైనవి ఉన్నాయి.

1947 ఆగస్టు 15న బ్రిటీష్ పరిపాలన నుండి దేశం విముక్తి పొందినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను మొదటి న్యాయ మంత్రిగా ఆహ్వానించింది.29 ఆగస్టు 1947న రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.దేశసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube