రాజన్న సిరిసిల్ల జిల్లా: పదవ తరగతి పేపర్ లీకేజ్ కి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని గంభీరావుపేట బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు మహేష్ యాదవ్, కృష్ణ కాంత్ యాదవ్ అన్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం జరిగినటువంటి పదవ తరగతి పేపర్ లికేజీ, 30మంది విద్యార్థుల ఆన్సర్ షీట్స్ మిస్ అయినా విషయానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
తెలంగాణ ప్రజలు కొట్లాడి,1200మంది అమరుల ఆత్మ బలిదానం తో తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎటు వెళ్తుందో ఎవరికీ అర్థం కావటం లేదన్నారు .ఇప్పుడు వున్నా పరిస్థితిలో అధికార పార్టీ పరిపాలన చేతకావటం లేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం విద్యార్థుల పరీక్షల నిర్వహించడంలో కూడా విఫలం అయ్యిందని,టెన్త్ పేపర్ లీక్ అవడం చాలా దురదృష్టకరం అని అన్నారు.
ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కూడిన తప్పిదమన్నారు.
కొందరు నాయకులు, ప్రభుత్వ అధికారులు కార్పొరేట్ విద్య సంస్థలకు అమ్ముడు పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని,30మంది విద్యార్థుల ఆన్సర్ పేపర్ మిస్ అవ్వడం ఇంకా పెద్ద తప్పిదమని ఈ రెండింటికి విద్యశాఖ మంత్రి బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గ్యాస్ ధర 50రూపాయలు పెరిగితేనే రోడ్డు మీదకు వచ్చిన విద్యశాఖ మంత్రి ఇప్పుడు ఎందుకు బాధ్యత వహించరో అని ప్రశ్నించారు.
తెలంగాణలో పటిష్టంగా వున్నా పోలీస్ వ్యవస్థను ఎందుకు ఈ ఎగ్జామ్స్ లో వాడుకోవడం లేదని ప్రతి పక్షాలను అణచివేయడానికి, కేసులు పెట్టడంలో వున్నా శ్రద్ద పరీక్షల విషయంలో లేదన్నారు.ఈ పేపర్ లీకేజీ, ఆన్సర్ షీట్స్ మిస్సింగ్ సంఘటనలో సమగ్ర విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మహేష్ యాదవ్, క్రిష్ణకాంత్ యాదవ్,జిల్లా మైనారిటీ మోర్చా ప్రెసిడెంట్ వాజీద్ హుస్సేన్,జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు యెలందర్, మండల కార్యదర్శి రవీందర్, లక్ష్మి నారాయణ, వెంకటి, రమేష్, బాబు, నాగరాజు గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.