రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా పాఠశాలలో చేరిన 6 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వామి వివేకానంద సేవాసమితి మల్యాల వారు ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర ఆధ్వర్యంలో టై, బెల్ట్, ఐడికార్డ్స్ అందించారు.
ఈ సందర్భంగా స్వామి వివేకానంద సేవ సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే జిల్లా పరిషత్ పాఠశాలలో చేరిన ఆరవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా టై,బెల్ట్, ఐడికార్డ్ లను అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర,టీచర్స్ అమర్ నాథ్, రవీందర్, తిరుపతి, లావణ్య, స్వర్ణలత, మమత లావణ్య స్వామి వివేకానంద సేవాసమితి సభ్యులు పాటి సుధాకర్, పంచెరుపుల దివ్యసాగర్, దుర్శెట్టి రాజు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.