వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దేవాలయ విస్తరణ పనులకు శ్రీకారం

రాజన్న ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతి తీర్థ మహా స్వాముల వారు,పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతి స్వాముల వారి ఆజ్ఞను కోరిన ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సీఎంవో ఓఎస్డి శ్రీనివాసులు,ఆలయ అధికారులు బృందం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో శృంగేరి వెళ్లిన ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, సీఎంవో ఓఎస్డి శ్రీనివాస్, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, ఆలయ అధికారుల, అర్చకుల బృందం.

 Vemulawada Sri Raja Rajeswara Swamy Temple Expansion Works Started , Sri Raja R-TeluguStop.com

రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ ఆలయం, దక్షిణ కాశీగా పేరుగాంచిన, కోరిన కోర్కెలు తీర్చే శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు, ఆలయ విస్తరణ పనులను ప్రారంభించడానికి శృంగేరి పీఠం వారి అనుమతులకై సిఎం ఆదేశాల మేరకు, శృంగేరి పీఠం సందర్శించారు.రెండు నెలల క్రితం ప్రభుత్వ విప్ శృంగేరి పీఠన్ని సందర్శించి ఆలయ విస్తరణ పై చర్చించినపుడు ఆలయా నమూనా తో రావాలని శృంగేరి పీఠాధిపతి తెలుపగా ప్రభుత్వ విప్ బృందం శృంగేరి పీఠం శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతి తీర్థ మహా స్వాముల వారికి,పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారిని కలిసి వారికి ఆలయ విస్తారణ నమూనాలను చూపెట్టి వారి సూచనలు సలహాల అనుగుణంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపట్టడం కోసం ఆజ్ఞను కోరారు.

శృంగేరి పీఠం శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతి తీర్థ మహా స్వాముల వారు,పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారు పలు సందేహాలకు తగు సూచనలు సలహాలను ఇస్తూ, శుభమని తెలియజేస్తూ ఆలయ విస్తరణకు ముందుకు వెళ్లాలని మౌఖికంగా ఆదేశాలించారు.త్వరలోనే శ్రీశ్రీశ్రీ జగద్గురులు శ్రీ రాజరాజశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ఆలయంలోని ఇతరత్ర అభివృద్ధి పనులకు అక్కడికక్కడే తగు సూచనలు సలహాలు ఇస్తానని పేర్కొన్నారు.

శృంగేరి శ్రీశ్రీశ్రీ జగద్గురులు భారతి తీర్థ స్వామి వారిని శ్రీ రాజరాజశ్వర వారి ఆలయానికి రావలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube