ఈరోజుల్లో కొందరు వివాహాలు జరిగిన తర్వాత భార్యాపిల్లల కోసం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను( Parents ) చిన్నచూపు చూస్తున్నారు.వృద్ధులైన తల్లిదండ్రులు కూడా వృద్ధాశ్రమాలకు పంపే వారు కూడా ఉన్నారు.
వారిలో తల్లిదండ్రులపై చేయిచేసే సాహసం చేసిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు.నడిరోడ్డు మీద మార్గమధ్యలో తల్లి, తండ్రిని చెప్పుతో కొట్టి రాక్షసంగా ప్రవర్తించాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేరస్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
కశ్మీర్ లోని శ్రీనగర్ లో( Srinagar ) ఓ కొడుకు( Son ) తల్లిదండ్రులపై బూటుతో దాడికి పాల్పడ్డాడు.మహ్మద్ అష్రఫ్ వానీ అనే వ్యక్తి తన తల్లి బేగంపై, తండ్రి గులాం అహ్మద్ వానీపై మార్గమధ్యలో దారుణంగా దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్( Video Viral ) కావడంతో, మహ్మద్ అష్రఫ్ వానీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై సెక్షన్ 74, సెక్షన్ 126 (2), సెక్షన్ 351 (2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.
వైరల్ వీడియోలో, వీధి పక్కన నడుచుకుంటూ వెళుతున్న తల్లిదండ్రులను చూసిన మహ్మద్ అష్రఫ్ తన బైక్ ఆపి తల్లిదండ్రులను చెప్పులతో కొట్టాడు.అనంతరం ఇద్దరు స్థానికులు వచ్చి కుమారుడి దారుణం నుంచి వృద్ధ తల్లిదండ్రులను కాపాడారు.ఇక ఈ విడెన్ చూసిన నెటిజన్స్ అతడిపై మంది పడుతున్నారు.“ఈ భూమిపై ఇలాంటి పాపాత్ములైన పిల్లలు కూడా ఉన్నారా…” అని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే.వీడు కొడుకు కాదు.విడో సైతాన్ అని.ఈ దుర్మార్గపు కొడుకును శిక్షించాలని కామెంట్ చేసారు.